కామవరపుకోట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. అంబేద్కర్ చిత్ర పటానికి ప్రధానోపాధ్యాయులు భీమరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు నివాళులర్పించారు. అయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసి భారత దేశ భవిష్యత్తుకు ఒక దిశ నిర్దేశం చేశారని ఒక గొప్ప విద్యావేత్త, మేధావి అని పలు విధాలుగా కొనియాడారు.