చింతలపూడి ఏరియా ఆసుపత్రికి నూతన కమిటీ సభ్యులను నియమిస్తూ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం జీవోతో కూడిన లేఖను విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, సభ్యులుగా ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తో పాటు మరో తొమ్మిది మందిని నియమించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు కోండ్రు దేవా, గుమ్మిశెట్టి భారతిలు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామన్నారు.