చింతలపూడి ప్రజలకు ఎమ్మెల్యే గుడ్ న్యూస్ చెప్పారు. చింతలపూడి నుండి విజయవాడకు ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు సర్వీసులు జంగారెడ్డిగూడెం డిపో నుండి నూజివీడు మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఆ రెండు సర్వీసులు మరల విజయవాడ నుండి అదే రూట్ లో జంగారెడ్డిగూడెంకు తిరిగి వెళతాయన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.