డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం నేషనల్ హైవే పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ జాబిర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది భద్రతకు కట్టుదిట్టంగా వ్యవహరించారు.