చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో పాత నాటుసారా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు, అనుమానితులుగా ఉన్న మరొక ఇద్దరు సోమవారం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ అయ్యారు. ఈ మేరకు సీఐ అశోక్ సోమవారం తెలిపారు. సర్కిల్ ప్రాంతంలో సారా తయారీ కేంద్రాల గురించి ప్రజలు సమాచారమిచ్చేలా వివరించారు. ఏవరైనా సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.