చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో ఎక్సైజ్ సీఐ అశోక్ తన సిబ్బందితో గురువారం నాటుసారా స్థావరాలపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఈ దాడిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి 2 లీటర్ల నాటుసారా సీజ్ చేసామన్నారు. 200 లీటర్ల బెల్లం ఊటాను నేలమట్టం చేశామన్నారు. బెల్లం సరఫరాదారుడుపై, సారా తయారీదారుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.