చింతలపూడి: నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

73చూసినవారు
చింతలపూడి: నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
చింతలపూడి ప్రొహిబిషన్&ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని చింతలపూడి మండలం ఫాతిమాపురం అడ్డ రోడ్డులో శుక్రవారం జరిపిన వాహన సోదాలలో బైకుపై నాటు సారాయిని రవాణా చేస్తున్న నాగిరెడ్డిగూడెంకు చెందిన భూక్య గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్