చింతలపూడి ప్రధాన సెంటర్లో శనివారం రాత్రి ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై భారీ గొయ్యి ఉండడంతో బైక్ అదుపుతప్పింది. దీంతో వాహన చోదకుడికి గాయాలయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.