చింతలపూడి నియోజకవర్గంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం అన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన 11 సబ్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా 'పునరుద్దరించబడు పంపిణీ రంగ పధకం' కింద నియోజకవర్గానికి కేటాయించిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ను కోరారు.