చింతలపూడి: జనసైనికులతో ఎమ్మెల్యే భేటీ

65చూసినవారు
చింతలపూడి: జనసైనికులతో ఎమ్మెల్యే భేటీ
చింతలపూడి, లింగపాలెం మండలాల జన సైనికులతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూటమి నాయకులతో సమన్వయంగా వ్యవహరించడం తమకు ఆనందం కలిగించిందని జనసైనికులు సంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ కేడర్ తో పాటు జన సైనికులకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్