చింతలపూడి జిల్లా పరిషత్ సుబ్బరాజు హైస్కూల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటిసారి పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థి మిత్ర కిట్లను అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.