కామవరపుకోట మండల బీజేపీ అధ్యక్షులు ఎస్ఆర్ఆర్ఎల్ఎస్ఎన్ రాజు చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ ను వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్బంగా మరియు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సూపరిపాలనకు 11 యేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుండి జరిగే కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.