చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో పాత చింతలపూడి సచివాలయ కార్యదర్శి గంగా భవానీని అధికారులు శనివారం సస్పెండ్ చేశారు. కలెక్టర్‌కు జీఎస్‌డబ్ల్యూఎస్ స్టేట్ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్ విషయంలో అలసత్వం వహించడంతో పాటు, జీఎస్ డబ్ల్యూఎస్ డైరెక్టర్ వీడియో కాన్పరెన్స్‌కు గైర్హాజరవడం అంశాలపై సస్పెండ్ చేసినట్లు ఉత్వర్వులో పేర్కొన్నారు.