ఆపరేషన్ సిందూర్ విజయానికి సంఘీభావంగా తిరంగా యాత్ర పేరుతో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో శనివారం సాయంత్రం 5 గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం శుక్రవారం తెలిపింది. దేశ సాయుధ దళాల శౌర్యం, ధైర్యం, త్యాగాలను గౌరవించడానికి ప్రజలందరి భాగస్వామ్యంతో చేపట్టే ఒక గొప్ప విజయ యాత్ర అని చెప్పారు. దీనిని రాజకీయాలకు పూర్తి అతీతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.