మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో యుకె లండన్ నుండి వచ్చిన పెట్టుబడి ప్రతినిధులతో టూరిజం కమిషనర్ ఆమ్రపాలిని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో పర్యాటక రంగం అభివృద్ధి ఎంతో అవసరమని అన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి అన్ని విధాలుగా తోడ్పడతామని హామీ ఇచ్చారన్నారు.