లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అన్నపనేనివారిగూడెంకు చెందిన రాచప్రోలు జానకి, బోగోలు గ్రామానికి చెందిన పాలగాని రాజేశ్వరిల నుంచి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.