ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం యూకె నుంచి ఇండియాకు యూకె డెలిగేషన్ టీం గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వారు భేటీ కానున్నారు.