చింతలపూడిలో వరుస ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పట్టణంలోని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద గుంతలో పడి ద్విచక్ర వాహనదారుడు శనివారం రాత్రి గాయాలపాలయ్యాడు. అలాగే ఆదివారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ మినీ ట్రక్ వ్యాన్ సెంట్రల్ లైట్ పోల్‌ను ఢీకొంది. దీంతో అధికారుల వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.