పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను తక్షణం తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరుపేదలకు రేషన్ కార్డుతో పాటు 14 రకాల నిత్యవసర వస్తువులను పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జాతీయ సమితి పిలుపులో భాగంగా బుధవారం జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామ సచివాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సిబ్బందికి మెమోరాండం సమర్పించారు.