వేగవరం సచివాలయ పరిధిలో మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుక్కలు మాధవరావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పింఛన్ అందజేశారు. ఆయన వెంట జనసేన పార్టీ ప్రెసిడెంట్ అనిశెట్టి శ్రీనివాస్, కొప్పుల సూర్య నారాయణ, కూటమి నాయకులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.