చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కలెక్టర్ వెట్రి సెల్విని కోరారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. నగర పంచాయతీ అభివృద్ధికి, రహదారులు, పార్కుల అభివృద్ధి కి తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ద్వారా ప్రతిపాదన పంపాల్సిందిగా కలెక్టర్ ను కోరారు.