గోదావరి వరదతో వేలేరుపాడు మండలములోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 15 మోటర్ బోట్లు, 30 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని ఆర్డీవో ఆదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ. ముంపు ప్రజలను తరలించడానికి 24 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. మరింత సహాయార్థం టోల్ ఫ్రీ నెం. 8919936844 ఏర్పాటు చేశామన్నారు.