కామవరపుకోట మండల కేంద్రంలో శనివారం ఉదయం భారీగా పోలీసులు మోహరించారు. స్థానిక రిజిస్టర్ కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీసులు మోహించారు. శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానానికి చెందిన స్థలంలోని ఆక్రమణలను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. ఘర్షణకు కారణమైనవారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.