ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పట్టణంలో చలిగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లల్లాడిపోయిన ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందుతున్నారు. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.