ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో ప్రమాదవశాత్తు తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇంట్లోనే గృహపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.