ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని మార్కండేయపురం కాలనీలో బుధవారం బాత్ రూమ్ లో ఐదు అడుగుల తాచు పాము హల్ చల్ చేసింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షులు చదలవాడ క్రాంతికి తెలియజేశారు. క్రాంతి ఆ ప్రాంతానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకొని సురక్షితంగా అటవి ప్రాంతంలో వదిలిపెట్టారు.