జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్సీ పేటలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను సోమవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు అంబేద్కర్ ఎంతోమందికి ఆదర్శమని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.