జంగారెడ్డిగూడెం: మద్యం షాపులు దరఖాస్తు గడువు పెంపు

62చూసినవారు
జంగారెడ్డిగూడెం: మద్యం షాపులు దరఖాస్తు గడువు పెంపు
జంగారెడ్డిగూడెం మండలంలో గౌడ కులాలకు కేటాయించిన మద్యం షాపులకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఈనెల 8 తేదీ వరకు పొడిగించినట్లు సీఐ శ్రీనుబాబు బుధవారం తెలిపారు. దరఖాస్తులు 8 తేదీ సాయంత్రం 5 గంటల వరకు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్లో  స్వీకరిస్తామని అన్నారు. దరఖాస్తు రుసుము 2లక్షలు చెల్లించాలని, 10వ తేదీ ఉదయం 9గంటలకు ఏలూరు మిని బైపాస్‌లో చలసాని గార్డెన్స్ నందు డ్రా తీస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్