జంగారెడ్డి పట్టణంలో ఆదివారం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయ రాజు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారత దేశ అత్యున్నత ఉపప్రధానిగా వ్యవహరించారన్నారు.