జంగారెడ్డిగూడెం: పంట ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు

85చూసినవారు
జంగారెడ్డిగూడెం: పంట ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు
జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురానికి చెందిన కొమ్మిరెడ్డి అజయ్ కుమార్ కు స్థానికంగా వ్యవసాయ భూమి ఉంది. సదరు భూమి విషయమై గొడవలు జరుగుతుండగా పెద్దల వద్ద పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలో నల్లజర్ల మండలానికి చెందిన గంటా రవి మరికొందరు ఈ నెల 3న పొలంలోకి అక్రమంగా ప్రవేశించి మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జబీర్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్