జంగారెడ్డిగూడెం 27వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వార్డు కౌన్సెలర్ నేట్రు సుబ్బలక్ష్మి అన్నారు. గురువారం వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సుబలక్ష్మి మాట్లాడుతూ. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేయడం జరిగిందన్నారు. వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.