ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం హైకోర్టు జస్టిస్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.