జంగారెడ్డిగూడెం: కూటమి నేతలతో ఎమ్మెల్యే సమావేశం

81చూసినవారు
కూటమి అభ్యర్థి రాజశేఖరం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల ఓటర్లను చేర్చడంలో జిల్లాలో ముందంజలో ఉన్నామన్నారు. ఓట్లు వేయించడంలోనూ ముందంజలో ఉండేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కూటమి నాయకులు సమన్వయంతో చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్