జంగారెడ్డిగూడెం విద్యుత్ డివిజన్ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ట్రాన్స్కో టవర్ లైన్ల చేంజ్ వర్క్స్ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.