జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో పట్టణంలో తాగునీటి సమస్యలు ఉండకూడదని సుమారు 60 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ పైప్ లైన్లు వేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె పనులను పరిశీలించారు. అలాగే పనులు పర్యవేక్షణ చేస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు చేయడం జరిగింది.