జంగారెడ్డిగూడెం: నేలకొరిగిన వృక్షాల తొలగింపునకు చర్యలు

59చూసినవారు
జంగారెడ్డిగూడెం: నేలకొరిగిన వృక్షాల తొలగింపునకు చర్యలు
జంగారెడ్డిగూడెంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలి వాన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పట్టణంలో స్థానిక టెలిఫోన్ ఎక్సేంజ్ సమీపంలో భారీ వృక్షం విద్యుత్ స్తంభంపై పడింది. దీనితో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనిపై వెంటనే స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి చెట్లు తొలగించి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్