కార్మిక ప్రజాసంఘాల అఖిలపక్ష సమావేశం జంగారెడ్డిగూడెంలోని ధర్మన్న స్మారక భవనంలో శనివారం జరిగింది. ఏఐటీయూసీ నాయకుడు కుంచె వసంతరావు పాల్గొని మాట్లాడారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, యువజనులు, విద్యార్థులు, రైతులు, కూలీలు అందరూ కలిసి విజయవంతం చేయాలని తెలిపారు. కనీస వేతనం రూ.26,000 చేయాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.