జంగారెడ్డిగూడెం: ముగ్గురు దొంగలు అరెస్ట్

57చూసినవారు
జంగారెడ్డిగూడెం: ముగ్గురు దొంగలు అరెస్ట్
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రవి చంద్ర వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 96 గ్రాముల బంగారు ఆభరణాలు, 46 గ్రాముల వెండి, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. రికవరీ చేసిన చోరీ సొత్తు విలువ రూ. 9, 80, 000 ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్