వర్జీనియా పొగాకు కిలో రూ. 325 కి చేరింది. జంగారెడ్డిగూడెం ఒకటో వేలం కేంద్రంలో శనివారం మేలు రకం పొగాకుకు ఈ ధర పలికింది. కాగా ఎన్ఎల్ఎస్లోని మిగిలిన జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రం, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురంల్లో జరిగిన వేలంలో రూ. 324 ధర లభించింది. వారం రోజులుగా గ్రేడ్ 1 పొగాకు ధరల్లో పెరుగుదల మొదలైంది. రూ. 290 వద్ద ప్రారంభమై క్రమంగా రూ. 325 గరిష్ఠ ధరకు చేరింది.