జంగారెడ్డిగూడెం పరిధిలోని గ్రామ దేవత గంగానమ్మ తల్లికి ఆదివారం జలాభిషేకం నిర్వహించారు. గ్రామంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు పండాలని కోరుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. ఈ క్రమంలోని ఈసారి కూడా అదే సంకల్పంతో జలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.