జంగారెడ్డిగూడెం పట్టణ శివారు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో 13 మందిని అరెస్టు చేశామని ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. వారి నుంచి రూ. 1, 22, 000 నగదు, 12 సెల్ఫోన్లు, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.