జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి కొండపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం గుండా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.