కామవరపుకోట: కోట్లలో వసూళ్లకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

84చూసినవారు
కామవరపుకోట: కోట్లలో వసూళ్లకు పాల్పడిన నిందితుడు అరెస్ట్
కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ నందిగం ధర్మరాజును రాజమండ్రి సిఐడి పోలీసులు శుక్రవారంఅరెస్టు చేశారు. స్కూల్ నిర్వాహకులు నందిగం రాణి- ధర్మరాజు 15 మందిని మోసగించి కోట్లలో వసూలు చేశారని సిఐడి డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో 3వ నిందితుడైన ధర్మరాజును అరెస్టు చేసి గుంటూరు జైలుకు రిమాండ్‌లో తరలించామన్నారు. అటు రూ. 14. 74కోట్ల ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్