కామవరపుకోట: రహదారి విస్తరణ పేరుతో గోడలు కూల్చివేత

7చూసినవారు
కామవరపుకోట: రహదారి విస్తరణ పేరుతో గోడలు కూల్చివేత
కామవరపుకోట వీరభద్ర స్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో రహదారి విస్తరణ పేరుతో గోడలు కూల్చివేశారు. శుక్రవారం స్థల వివాదం నేపథ్యంలో జరిగిన గొడవ కారణంగా సందట్లో సడేమియా అన్న చందాన రోడ్డుకు ఇరుపక్కల ఉన్న గోడలను కొలతల ప్రకారం కాకుండా ఇస్తానుసారంగా ఆలయ ఈవో శ్రీనివాసులు, ఆలయ ధర్మకర్త కొండూరు శ్రీధర్ దగ్గర ఉండి కూల్చి వేయించారు. ఏదైనా రహదారి విస్తరణ పనులు చేపట్టినప్పుడు రోడ్డుకు ఇరుపక్కల సమానంగా తీయించడం జరుగుతుంది. అలా కాకుండా ఆలయ సమీపంలో ఉన్న ఏడు కుటుంబాల వారికి చెందిన గోడలను కూల్చి వేయించారు.

సంబంధిత పోస్ట్