లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో భవిత దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న దివ్యంగా విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన 14 ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే వారికి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యాధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.