లింగపాలెం మండలంలో ఈనెల 18న మినీ మహానాడు నిర్వహించేందుకు 4 మండలాల టీడీపీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం అన్నారు. నాలుగు మండలాల నుండి ఈ మినీ మహానాడు కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు వచ్చేలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అందరూ నాయకులు కృషి చేయాలని కోరారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త మినీ మహానాడు లో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.