అంబేడ్కర్ జయంతి సందర్భంగా లింగపాలెం మండలం వేములపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో ఎస్ఆర్ కె టీం విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం పాల్గొని పోటీలను తిలకించారు. ఎస్ఆర్‌కె టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 6 వికెట్ల నష్టానికి 12 ఓవర్లకు 134 పరుగులు చేసింది. 2వ టీం ఆడమిల్లి టీం 4 వికెట్ల నష్టానికి 12 ఓవర్ల ముగిసే సరికి 67 పరుగులు చేసింది. విజేతగా ఎస్‌ఆర్‌కె టీం నిలిచింది.