నిలకడ లేని ధరలతో ఆక్వా సాగు కలవరపడుతోంది. ధరల స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోతే సాగు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల ముందు వరకు కిలో తెల్ల చేప ధర రూ. 120-130 పలికింది. ఇప్పుడది రూ. 110కి పడిపోయింది. ఫంగస్ ధర కిలో రూ. 100 నుంచి రూ.80కి తగ్గింది. అప్పటికే లక్షలు రూపాయిలు పెట్టుబడులు పెట్టేసి రైతులు ఆందోళన చెందుతున్నారు.