నిరంతరం చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం చింతలపూడిలోని తన కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.