జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఇటీవల జరిగిన క్లస్టర్ సమావేశంలో కార్యకర్తల కష్టాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సయ్యద్ అన్వర్ అనే ఆటో డ్రైవర్ ఆటో తోలుకుంటూ జీవనం గడుపుకునేవాడినని రెండు నెలలు ఖాళీగా ఉండటం వలన కుటుంబం గడవడం కూడా కష్టంగా మారిందని కొంత ఆర్థిక సహాయం చేస్తే సొంతంగా ఆటో కొనుక్కుంటానని చెప్పడంతో ఎమ్మెల్యే స్పందించారు. దీంతో శుక్రవారం 50, 000 ఆర్థిక సాయం చేశారు.